3, డిసెంబర్ 2009, గురువారం

ఎయిడ్స్ గురించి ప్రచారం - నవ్వుల పాలు

ఎయిడ్స్ నివారణ గురించి చాలా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి .కానీ కొన్ని స్లోగన్స్,యాడ్స్,చుస్తే నవ్వు వస్తుంది .ఎయిడ్స్ కి మందు లేదు నిరోద్ వాడండి అని ప్రచారం చేస్తున్నాయి. మంచి విలువలు పాటించండి ,క్రమశిక్షణతో ఉండండి,అని ప్రచారం చేస్తే అది ఎయిడ్స్ కి మాత్రమే కాదు సమాజానికి కూడా మంచిది అని ప్రచారం చేస్తే భాగుంటుంది కదా .

19, నవంబర్ 2009, గురువారం

చిన్న పిల్లల సినిమాలు -ప్రసార మాధ్య మాలు

మన రాష్ట్రములో చిన్న పిల్లల సినిమాలు నిర్మించటం లేదు అని అందరూ అంటారు ,కానీ నిర్మించిన కొన్ని చిత్రాలు కూడా పిల్లల వరకు చేరుతున్నాయా అని మనం ఆలోచించాలి.మన నిర్మాతలు నిర్మించిన చిన్నపిల్లల సినిమాలకి దియేటర్లు లేవని అంటారు.
చిన్న పిల్లల సినిమాలు సినిమా హల్లో నే చూడాలని అందుకు అనుకుంటున్నారు . మన రాష్ట్రము లో ఇప్పుడు చాలా చానల్స్ ఉన్నాయి కదా వాటిలో నటీ నటుల గాసిప్స్ గురించి చాలా సమయం వృధా చేస్తున్నారు .వాటికీ బదులు సెలవులలో, వారానికి ఒక్క సరి అయినా తెలుగు లో అవార్డ్స్ వచ్చిన చిన్న పిల్లల సినిమాలు ,మంచి సినిమాలు ప్రసారం చేస్తే మనకి కూడా చిన్నపిల్లల సినిమాలు చూసే అలవాటు అవుతుంది.తరవాత మన వాళ్ళుకూడా హల్లోచిన్నపిల్లల సినిమాలు చూస్తారు.